Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెప్పిన మాటవినలేదనీ భార్య గొంతు కోసిన భర్త.. ఎక్కడ?

Advertiesment
Hyderabad
, గురువారం, 7 మార్చి 2019 (11:43 IST)
భార్యాభర్తల మధ్య అంటే చిన్నపాటి మనస్పర్ధలు సహజం. కోపతాపాలు ఉంటాయి. అయితే, ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య తన మాట వినడం లేదని ఏకంగా ఆమె గొంతుకోశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని గోల్కొండ ఏరియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోల్కొండకు చెందిన రియాజ్‌కు రుబీనా అనే యువతితో ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. రియాజ్‌ పనిపాటాలేకుండా జులాయిగా తిరుగుతుండటంతో రుబీనా అతడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. గతకొన్ని రోజులుగా ఆమె పుట్టింటిలోనే ఉంటూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రియాజ్‌ బుధవారం అత్తగారింటి వద్దకు వచ్చాడు. తనతో ఇంటికి రావాలని తన భార్యను పిలవగా ఆమె అందుకు నిరాకరించింది. పైగా, ఇకపై ఇంటికి రానని తెగేసి చెప్పింది. 
 
దీంతో విచక్షణ కోల్పోయిన రియాజ్‌ కత్తితో భార్య మెడపై బలంగా కోయటంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో రియాజ్‌ అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స‍్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రుబీనాను ఉస్మానియాకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో ఎఫెక్ట్.. ప్రపంచంలోకెల్లా భారత్‌లో చౌక ధరకే డేటా