శోభనం రోజు రాత్రే ఓ నవవధువుకు అనుమానపు భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. నీవు కన్యవా? కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆ నవ వధువు తల్లడిల్లిపోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బసవనగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బవనగుడి ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివేక్ రాజగోపాల్ అనే వ్యక్తి వివాహం జరిగింది. ఈ వివాహం ఆర్నెల్ల కిందట జరిగింది. అయితే, వివేక్ రాజగోపాలన్ వివాహమైన తొలి రాత్రిలోనే భార్య ప్రవర్తనపట్ల అనుమానం మొదలైంది. ముఖ్యంగా, నీవు కన్యవా? కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం.
పైగా, తమ తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక పెళ్లి చేసుకున్నట్టు, తనను వదిలి వెళ్లిపోవాలని పదేపదే ఒత్తిడి చేయసాగాడు. ఈ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఆమె భరించలేక పోయింది. దీనికితోడు... భార్యను ఉద్యోగానికి పంపించి, జీతం డబ్బులు తనకు తెచ్చివ్వాలంటూ వేధించాడు.
ఇలా ప్రతి రోజూ నరకం చూపించడంతో ఇక భరించలేనని భావించిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. దీనిపై బనవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.