అప్పటి కాలంలో నగ్మా పేరు వింటేనే పులకించిపోయేవారు. ఆమె ఆకట్టుకునే అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసేది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు నగ్మా అంటే చాలా ఇష్టం.. 1990 సంవత్సరంలో అయితే నగ్మా పేరు చెబితేనె చాలు అందరూ ఏదో కొత్త అనుభూతికి లోనవుతుంటారు. అలానే తెలుగులో సినీ ఇండస్ట్రీలో టాప్-4 హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో నటింటిన కొద్ది మంది హీరోయిన్లలో నగ్మా ఒకరు. ఆ కాలంలో యువతకు కలల రాణిగా మారిపోయింది.
ఇక దక్షిణాది భాషలన్నింటిలోనూ టాప్ హీరోలందరితో నటించారు. అరేబియన్ గుర్రం వంటి నగ్మా కోసమే యువతరం థియేటర్లకు క్యూ కట్టేవారు. చివరగా ఆమె తెలుగులో నటింటిన చిత్రం 'అల్లరి రాముడు'. ఇందులో యంగ్ ఎస్టీఆర్‌కు అత్తగా నటించారు నగ్మా.
ఆ చిత్రం తరువాత సినిమాల్లో నుండి రాజకీయాల్లోని అడుగుపెట్టిన నగ్మా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా మారారు. ఇప్పుడు ఆమె వయసు 44 ఏళ్లు. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పెళ్లి గురించే మరిచిపోయారు. తన చెల్లెళ్లు జ్యోతిక, రోషణి హాయిగా కుటుంబ జీవితాన్ని సాగిస్తుంటే.. నగ్మా మాత్రం ఒంటరిగానే తన జీవితాన్ని గడిపేస్తోంది. దీని కారణంగా ఎక్కడికి వెళ్లినా పెళ్ళెప్పుడూ అంటూ ఆమెకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.
ఇటీవలన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికరంగా స్పందించారు నగ్మా. రాసి పెట్టి ఉంటే నాకు పెళ్లి కచ్చితంగా జరుగుతుందని చెప్పారు. అయితే.. దేవుడు రాసిపెట్టిన సమయానికి మాత్రం తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఎప్పుడు ఏది జరగాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరి జీవితంలోనైనా పెళ్లి రాసిపెట్టుందా.. లేదా.. అనే విషయాన్ని దేవుడు ముందే డిసైడ్ చేసి ఉంటాడు. నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు.. అలాగని నేను పెళ్లికి వ్యతిరేకం కాదు.. అంటూ చెప్పుకొచ్చారు.