Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీతమ్మ పెళ్లి చేసుకోవట్లేదట.. పెళ్లి చేసుకున్నా.. ఆ పని చేస్తుందట..

Advertiesment
Actress
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో తెలుగు ప్రేక్షకుల మనసు చూరగొన్న అచ్చమైన తెలుగమ్మాయి అంజలి పెళ్లిపై నోరు విప్పింది. త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించింది.
 
ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని తేల్చేసింది. స్తుతం తాను నటనతో బిజీగా ఉన్నానని, పెళ్లి ఆలోచన లేదని కొట్టిపారేసింది. ఒక వేళ పెళ్లి చేసుకున్నా.. నటనను కొనసాగిస్తానని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఓ తమిళ నటుడితో ప్రేమలో పడిందని అంజలిపై వార్తలొచ్చాయి. 
 
ఆ ప్రేమికుడితో అంజలి వివాహం జరుగనుందని టాక్ వచ్చింది. పెళ్లి తర్వాత నటనకు దూరమైన ఎంతోమంది హీరోయిన్లు మళ్లీ నటించేందుకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. పెళ్లయిన తర్వాత తానెందుకు ఇంట్లో కూర్చోవాలని ఎదురు ప్రశ్నిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తి సరసన రష్మిక మందన.. వదులుకుంటుందా ఏమిటి?