Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్‌ను పుట్టించింది మేమే అంటే నవ్వు రాదా?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని.. రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (13:46 IST)
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని.. రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సాగింది. దీనిపై రేణుకా చౌదరి మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని గుర్తు చేశారు. 
 
అలాంటి మోదీ ప్రస్తుతం ఆధార్‌ను పుట్టించిందే తామేనని చెప్తే నవ్వు రాకుండా వుంటుందా అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అలా నవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆయన తనను కించపరుస్తూ మాట్లాడారని రేణుకా ఆవేదన వ్యక్తం చేశారు.
 
తన నవ్వుపై కామెంట్స్ చేయడం ద్వారా ప్రధాని స్థాయిని మరిచిపోయారన్నారు. ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాంటి కామెంట్ల్ చేయవచ్చా అంటూ ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి సరిపోయింది. ఇదే వ్యాఖ్యలు బయటెక్కడైనా చేసి వుంటే ఈపాటికి మోదీపై చట్టప్రకారం కేసు నమోదు చేసి వుండేదాన్నంటూ రేణుకా చౌదరి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments