Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేణుకా చౌదరిని మోదీ ఇలా అనేశారే? రామాయణం తర్వాత ఆ నవ్వును..?

''ట్రిపుల్ తలాక్'' బిల్లు ఓ ఒక్క కమ్యూనిటినో ఉద్దేశించినది కాదని.. ఇదే నేరం కింద హిందూ పురుషులను కూడా జైలు పంపుతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ట్రిపుల్ తలాక్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున

రేణుకా చౌదరిని మోదీ ఇలా అనేశారే? రామాయణం తర్వాత ఆ నవ్వును..?
, గురువారం, 8 ఫిబ్రవరి 2018 (09:11 IST)
''ట్రిపుల్ తలాక్'' బిల్లు ఓ ఒక్క కమ్యూనిటినో ఉద్దేశించినది కాదని.. ఇదే నేరం కింద హిందూ పురుషులను కూడా జైలు పంపుతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ట్రిపుల్ తలాక్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్దాంతంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణమని మోదీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రతీదానిని విమర్శించడాన్నే పనిగా పెట్టుకున్నారని.. స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా, సర్జికల్ స్ట్రైక్స్, యోగా డే ఇలా అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతూనే వుందని దుమ్మెత్తిపోశారు.
 
విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి వున్నప్పటికీ ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యాంగ హోదా దక్కకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బిల్లుపై నిర్మాణాత్మక చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు మోదీ ప్రకటించారు. కేంద్రం కొత్త తీసుకొచ్చిన ఆరోగ్య కార్యక్రమం ఆయుష్మాన్ భవత్‌పై అన్నీ పార్టీల సలహాలు, సూచనలు కావాలని కోరారు. 
 
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ చేసిన మోసాన్ని కూడా నరేంద్ర మోదీ ఎండగట్టారు. గతంలో కాంగ్రెస్ చేసిన మోసం వల్లే దేశం ఫలితం అనుభవిస్తుందని విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష నేతలు కొందరు అరుపులతో అంతరాయం కలిగించారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా గట్టిగా అరిచారు. దీంతో మోదీ సరదాగా ఆమెపై కౌంటర్లు విసిరారు. 
 
దీనిపై రేణుకా చౌదరి మాట్లాడుతూ..  ప్రధాని తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. అలాంటి వ్యక్తి నుంచి ఇంకేమి ఆశించగలమన్నారు. మోదీ తన వ్యాఖ్యల ద్వారా మహిళలను కించపరిచారని మండిపడ్డారు.

మోదీ ప్రసంగం వింటున్న రేణుక బిగ్గరగా నవ్వడంతో రామాయణం తర్వాత ఈ రకమైన నవ్వును వినే అవకాశం ఇప్పుడే లభించిందంటూ రేణుకా చౌదరిని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించడం చర్చనీయాశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్.. తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు : టీడీపీ