అంజయ్యను రాజీవ్ అవమానిస్తే.. చంద్రబాబును మోడీ అవమానించలేదా?
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైన దివంగత అంజయ్య, నీలం సంజీవ రెడ్డిలను మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అవమానిస్తే ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవమానించారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైన దివంగత అంజయ్య, నీలం సంజీవ రెడ్డిలను మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అవమానిస్తే ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవమానించారు. అపాయింట్మెంట్ కావాలంటూ చంద్రబాబు ఒక యేడాది కాలం మొరపెట్టుకున్నారు. కానీ, ప్రధాని మోడీ ఇవ్వలేదు. ఈ యేడాది కాలంలో వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాత్రం ప్రధానితో మూడుసార్లు భేటీ అయ్యారు. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించడం కాదా. అలాగే, పార్లమెంట్ సాక్షిగా హామీలను ఉల్లంఘించడం రాజ్యాంగాన్నే అవమానించడం కాదా?
పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ చేసేందుకు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ తలుపులు మూసి మరీ విభజన చట్టం ఆమోదించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఇపుడేదో కొత్తగా కనిపెట్టినట్టు చెపుతున్నారు. ఆ రోజున ఒక తలుపు కాంగ్రెస్ మూస్తే మరో తలుపుమూసింది బీజేపీ నేతలు కాదా. అక్కడ బాధ్యత కానట్టు రాజ్యసభలో మాత్రం మంతనాలు జరిపి ప్రత్యేక హోదా పట్టుపట్టింది బీజేపీ నేత, ఇప్పుడు సభాద్యక్షుడు వెంకయ్య నాయుడేనన్న విషయాన్ని మోడీ విస్మరించినట్టున్నారు.
విభజన చట్టంలోని రెండు మూడు అంశాలను పునరుద్ఘాటించడంతో పాటు అయిదేళ్ల ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీ, రాజధానికి సహాయం, పోలవరం జాతీయ హోదా, వెనుకబడిన జిల్లాలకు సాయం, బుదేల్‌ఖండ్ ప్యాకేజీ అన్న అంశాలను నాటి ప్రధాని రాజ్యసభలో లిఖితపూర్వకంగా ప్రక టించారు. దాన్ని అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఘనంగా వాగ్దానం చేసింది. నమ్మి ఓటేశాక చట్టబద్ధత లేదని ఎగనామం పెట్టింది. పోనీ మీరు చట్టబద్ధత కల్పించివుండొచ్చు కదా నరేంద్ర మోడీ.. ఇది ఇది మోసం చేయడం కాదా అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.