Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక మోడీతో సయోధ్య లేదు.. సమరమే.. ఎంపీలతో చంద్రబాబు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా పూర్తిగా విఫలమైందనీ, ముఖ్యంగా, శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని నరేంద్ర

ఇక మోడీతో సయోధ్య లేదు.. సమరమే.. ఎంపీలతో చంద్రబాబు
, గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:14 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా పూర్తిగా విఫలమైందనీ, ముఖ్యంగా, శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల అమలు చేయకుండా మోసం చేశారనీ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వెళ్లగక్కారు. ఇకపై కూడా ఆయన న్యాయం చేస్తారన్న నమ్మకం లేదనీ ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల తాడోపేడో తేల్చుకోవాలని సూచన చేశారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉభయసభల్లో మన ఎంపీలు బాగా పని చేశారని కితాబిచ్చారు. ముఖ్యంగా, గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ఆయన ప్రశంసించారు.
 
మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎక్కడైనా ప్రతిపక్షం ముందుండి పోరాటం చేస్తుందని... కానీ, కేసుల భయంతో వైసీపీ ఆ పని చేయలేకపోతోందని చెప్పారు. ఉభయసభల్లో మన ఎంపీలంతా మన గళాన్ని గట్టిగా వినిపించాలని... మన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 
 
విభజన హామీల్లో చట్ట ప్రకారం రాష్ట్రానికి ఇవాల్సి నిధుల మంజూరులో కేంద్రం మోసం చేసింది. మూడున్నరేళ్ళగా ఊరించి రేపు, మాపు అంటూ వాయిదాలు వేస్తూ చివరికి ఎన్నికల మందు బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు సైతం తగ్గించేశారు. ఇలాగైతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో కేంద్రానికి గుణపాఠం చెబుతారంటూ ఆయన ఆక్రోశం వెళ్ళగక్కారు. అంతేకాకుండా, బీజేపీతో ఉన్న సంబంధాలపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీర్రాజుపై అమిత్ షా ఫైర్... మరోసారి బాబు గురించి అలా మాట్లాడితే అంతేసంగతులు...