Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతా మాయిష్టం.. ఇదే మోడీ తీరు : ఏపీకే కేంద్రం కొర్రీలు

"అంతా నాయిష్ట ప్రకారమే జరగాలి. నేను చెప్పినట్టే చేయాలి. మనకు కలిసిరాని రాష్ట్రాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిత్రపక్షాలతో పని లేదు. మనదారి మనదే.. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వె

అంతా మాయిష్టం.. ఇదే మోడీ తీరు : ఏపీకే కేంద్రం కొర్రీలు
, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:39 IST)
"అంతా నాయిష్ట ప్రకారమే జరగాలి. నేను చెప్పినట్టే చేయాలి. మనకు కలిసిరాని రాష్ట్రాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిత్రపక్షాలతో పని లేదు. మనదారి మనదే.. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేదిలేదు" ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వైఖరి అని తేలిపోయింది. 
 
కొత్తగా ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చేది లేదన్నారు. 14వ ఆర్థిక సంఘం ఎవ్వరికీ అలాంటి ఇవ్వొద్దని సిఫారసు చేసిందనే కొర్రీ పెట్టారు. కానీ, తమకు నచ్చిన, రాజకీయంగా అవసరమైన రాష్ట్రానికి మాత్రం అన్నీ ఇచ్చుకున్నారు. అలాంటి రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. విభజన తర్వాత నవ్యాంధ్రకు రూ.16వేల కోట్ల లోటు ఉందని 'కాగ్' కూడా నిర్ధారించింది. కానీ... ఈ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం అనేక కొర్రీలు పెడుతోంది. 
 
అదే హిమాచల్‌ విషయానికి వచ్చేసరికి... అంత చిన్న రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద ఏకంగా ఏటా రూ.8 వేల కోట్లు ఇచ్చేసింది. ఈ యేడాది ఇప్పటికే మూడు త్రైమాసికాల్లో విడతల వారీగా నిధులు మంజూరు చేసింది. ఈ మొత్తం కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే చెల్లించేశారు. అంతేకాదు... ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కొనసాగిస్తున్నారు. అంటే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమనేది ఒకసాకు మాత్రమేనని స్పష్టమైపోయింది. 
 
అదేసమయంలో రెవెన్యూ లోటుపై అదే ఆర్థిక సంఘం చేసిన సిఫారసును కూడా మోడీ సర్కారు చెత్తబుట్టలో పడేసింది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు 2019-2020 ఆర్థిక సంవత్సరం నాటికి కూడా రెవెన్యూ లోటు కొనసాగుతుందని తేల్చింది. ఆ తర్వాత కూడా రెవెన్యూ లోటు ఉండే ఒకటి రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని పేర్కొంది. అందువల్ల... 2015-16 నుంచి ఐదేళ్లపాటు లోటు భర్తీ కోసం ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. కానీ... మోడీ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు కదా, ఆర్థిక సంఘం నివేదికను సైతం తమ అవసరాలు, విచక్షణ మేరకు ఆయన ఉపయోగించుకుంటున్నారు. అంటే.. గతంలో కాంగ్రెస్ పాలకులు చేసిన మోసం, దగా కంటే రెట్టింపు ఉత్సాహంతో మోసం చేశారనీ తేలిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేయసి కోసం సౌదీ రన్‌వే పై పరిగెత్తిన ప్రేమికుడు.. ఎందుకు?