ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

ఠాగూర్
శుక్రవారం, 25 జులై 2025 (13:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లకాలంలో రూ.295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో మోడీ విదేశీ పర్యటనకలకు సంబంధించి ఏ దేశానికి వెళ్లినపుడు ఎంత ఖర్చయిందన్న వివరాలను ఆయన వెల్లడించారు. 
 
2021 నుంచి 2024 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.295 కోట్లు వెచ్చించినట్టు మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఫ్రాన్స్ పర్యటనకే రూ.25 కోట్లు ఖర్చయిందని వివరించారు. 2023 జూన్ నెలలో మోడీ అమెరికా ప్యటనకు రూ.22 కోట్లు ఖర్చయిందన్నారు. ఇటీవల మోడీ ఐదు దేశాలలో పర్యటించగా దీనికోసం రూ.67 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈ యేడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ మరాషెస్, సైప్రెస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించారు. అయితే, ఈ దేశాలకు సంబంధించిన ఖర్చులను మాత్రం ఆయన వెల్లడించక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments