Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోట శ్రీనివాస రావు మరణం బాధాకరం : ప్రధాని నరేంద్ర మోడీ

Advertiesment
Modi

ఠాగూర్

, ఆదివారం, 13 జులై 2025 (18:57 IST)
తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాస రావు మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సంతాన్ని తెలిపారు. ఇదే విషయంపై ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పోస్ట్ చేశారు. "కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి" అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ, మద్రాస్ నుంచి మా కుటుంబం తో కోట గారికి అనుబంధం. మా‌ నాన్న గారితో కలిసి నటించారు. చాలా సరదాగా ఛలోక్తులు వేసి మాట్లాడతారు. వారితో సమయం గడిపెందుకు ఇష్టపడుతుంటాను‌. అలాంటి వ్యక్తి ని కోల్పోవటం బాధాకరం అని పేర్కొన్నారు. 
 
నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, "కోట గారి సినిమాలు చూసె స్పూర్తి పొందాను. ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. విశిష్డ మైన వ్యక్తి.. ‌అందరికీ నచ్చడు.. ఎవరిని మెప్పించటానికి ప్రయత్నం చేయరు. ఆయనది ఒక ప్రజెన్స్..‌ తనదైన వ్యగ్యం ఉండేది. తెలుగు ప్రతిభకు చాన్స్ దొరకటం లేదని అనగానే తొలుత నాకు భాద వేసింది. కానీ ఆ తరువాత వారి బాధ నిజమే అని అర్దమయింది. ప్రకాష్ రాజ్ తెలుగువారు కాదు కదా అంటే.. తెలుగు మాట్లాడతాడు.. పరాయివాడు కాదు అనేవారు. నాపై కూడా ఛలోక్తులు విసిరేవారు. ఈమధ్య  ఫోన్ చేశా..‌ మాతో  కలిసి  ఓ సినిమా సెట్లో గడిపారు. వారి ఇంట్లో జరిగిన పెయిన్ ను బయట ఎక్కడా చూపెవారు కాదు. వారి వ్యక్తిత్వం నాకు ఎంతో ఇష్డం" అని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోటకు తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం : మంత్రి కందుల దుర్గేష్