Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోట శ్రీనివాస రావు ఇకలేరు... ప్రముఖుల సంతాపం

Advertiesment
kota srinivasa rao

ఠాగూర్

, ఆదివారం, 13 జులై 2025 (08:16 IST)
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూశారు. ఆయన వయసు 83 యేళ్లు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్‌  2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 
 
సినిమాల్లోకి రాక ముందు కోట శ్రీనివాసరావు స్టేబ్‌ బ్యాంకులో పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన (1985), గాయం (1993),  తీర్పు (1994), లిటిల్‌ సోల్జర్స్‌ (1996), గణేష్ (1998), చిన్న (2000), పెళ్లైన కొత్తలో (2006), ఆ నలుగురు (2004), పృథ్వీ నారాయణ (2002) చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 
 
2012లో చిత్రం 'వందే జగద్గురుమ్‌' సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దర్శక నిర్మాత క్రాంతికుమార్‌.. వెండి తెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ భాజపా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు షించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది 100 సినిమాకు ముందు సుకుమార్ కథలు అడిగా : ఆర్కే సాగర్