Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

సెల్వి
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (22:11 IST)
India
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. పర్యాటకులైనా, ఇతర కారణాలతో భారత్‌లో ఉన్న పాక్ పౌరులైనా ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అని ప్రకటించింది. 
 
ఇకపై పాకిస్థాన్‌ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 
 
ఇంకా న్యూఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషనర్‌కు కూడా తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అన్ని నిర్ణయాలపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఘటన పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి సడలింపు ఉండదని తేల్చేశారు. 
PM MOdi
 
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ తీసుకున్న 5 చర్యలు
సింధు జల ఒప్పందాన్ని నిలుపుదల చేశారు
పాకిస్తానీ జాతీయులకు సార్క్ వీసాలు లేవు
పాకిస్తానీతో ఉన్న అటారీ సరిహద్దు మూసివేయబడుతుంది
పాకిస్తానీలోని తన హైకమిషన్ నుండి సిబ్బందిని ఉపసంహరించుకునే భారతదేశం 
పాకిస్తాన్ జాతీయుల ప్రస్తుత వీసాలను రద్దు చేయడం, 
వారు 48 గంటల్లోపు భారత్ నుండి వెళ్లిపోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments