Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూట్‌కేసులో 70 పాములు, చనిపోయిన కోతులు... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (18:46 IST)
విమానంలో విషపూరిత పాములను సూట్‌కేసు ద్వారా తరలించిన తమిళనాడు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో హాంకాంగ్ నుంచి రాత్రి 10.30 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి విమానం చేరుకుంది. దిగిన ప్రయాణికులు టెర్మినల్ 1 గుండా బయటికి వస్తున్నారు. కస్టమ్స్ అధికారులు వారి వస్తువులను తనిఖీ చేశారు.
 
అంతలో ఓ యువకుడు సూట్‌కేస్‌తో వచ్చాడు. అతడిని చూడగానే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడి వద్ద విచారణ జరిపారు. అతను తమిళనాడుకు చెందినవాడని తేలింది. ఆ తర్వాత అతడు తెచ్చిన సూట్‌కేస్‌ను తెరిచి సోదాలు చేశారు. 
 
అంతే షాక్ అయ్యారు. ఆ సూట్‌కేసులో ప్రాణాంతక విషం ఉన్న 20 రాజనాగపు పాము పిల్లలతో సహా 70కి పైగా పాములు సజీవంగా ఉన్నాయి. ఒక్కో పామును చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచినట్లు కూడా గుర్తించారు. అలాగే ఆ సూట్‌కేస్‌లో 6 చనిపోయిన కోతులు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న కస్టమ్స్ డిపార్ట్ మెంట్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతడిపై కేసు కూడా నమోదు చేశారు. ఇంకా సజీవంగా ఉన్న అన్ని పాములను హాంకాంగ్‌కు తిరిగి పంపించారు. చనిపోయిన ఆరు కోతులను మాత్రమే పారవేశారు. ఈ ఘటన విమానాశ్రయంలో కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments