Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్లు

Advertiesment
liquor
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (08:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు అధికార నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. కొందరు వాలంటీర్లు హద్దు దాటిపోయి హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డారు. తాజాగా ఇద్దరు వాలంటీర్లు కర్నాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. 
 
ఏపీలోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానిక అంగళ్లు పాత ట్యాంకు వీధిలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కమల్‌ ఆదేశాలపై మదనపల్లె సెబ్‌ గురువారం తనిఖీలు నిర్వహించింది. 
 
అంగళ్లు క్లస్టరు-19 వాలంటీరు అవర దాసరి సందీప్‌కుమార్‌, మరో మహిళా వాలంటీరు లేపాక్షి అమ్మాజీ, కర్ణాటకలోని రాయల్పాడుకు చెందిన ఆర్‌.ఎస్‌.నడిపిరెడ్డిని అరెస్టు చేసింది. వీరి నుంచి ఆటోతోపాటు రూ.35 వేల విలువైన 480 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది. 
 
నిందితులను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండు విధించారు. ఓ వైకాపా నాయకుడి అండదండలతోనే కర్ణాటక మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వైకాపా నాయకుడి వద్ద విచారణ జరిపేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యభిచార మహిళలను ఇంటికి పిలిపించుకుని చంపేశాడు.. ఎక్కడ?