Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ తీరంలో మిస్‌వరల్డ్... సుదర్శన్ చెక్కిన శిల్పం

భారత్ తరపున 17 యేళ్ల తర్వాత మిస్ వరల్డ్ 2017గా టైటిల్‌కు ఎంపికైన ఆరో మహిళ మానుషి చిల్లార్. 2000 సంవత్సరంలో టైటిల్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా తర్వాత ఇప్పుడు ప్రపంచ సుందరిగా ఎంపికైన భారతీయ మహిళ.

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (15:53 IST)
భారత్ తరపున 17 యేళ్ల తర్వాత మిస్ వరల్డ్ 2017గా టైటిల్‌కు ఎంపికైన ఆరో మహిళ మానుషి చిల్లార్. 2000 సంవత్సరంలో టైటిల్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా తర్వాత ఇప్పుడు ప్రపంచ సుందరిగా ఎంపికైన భారతీయ మహిళ. ఏకంగా 108 మందితో పోటీ పడి.. అందరినీ వెనక్కి నెట్టిన మానుషి.. నవంబర్ 18న చైనాలోని సన్యా నగరంలో జరిగిన ఫైనల్స్‌లో విజేతగా ప్రపంచ విజేతగా నిలిచింది. 
 
మిస్ వరల్డ్‌గా నిలిచిన ఈ హర్యానా బ్యూటీకి దేశ నలుమూలల నుంచి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా చేరిపోయారు. ‘మానుషి.. భారత్ గర్వపడేలా చేశారు’ అని ప్రశంసిస్తూ పూరీ తీరంలో ఆమె సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. మానుషి చిల్లార్ ప్రపంచ సుందరి కిరీటం ధరించిన సైకత శిల్పాన్ని నిర్మించారు. వెనుక మువ్వన్నెల జాతీయ జెండా, మానుషి చిల్లార్‌కు శుభాకాంక్షలు, మిస్ వరల్డ్ 2017 అని చెక్కిన సైకతశిల్పం అద్భుతంగా ఉందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments