Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్క గర్భానికి ఫ్రెండే కారణమని మర్మాంగాన్ని కోసేసిన అన్నదమ్ములు

తమ అక్క పెళ్లి కాకుండానే గర్భందాల్చడానికి ప్రధాన కారణం తమ స్నేహితుడు కావడంతో అతని మర్మాంగాన్ని ఇద్దరు అన్నదమ్ములు కోసేశారు. అంతేకాకుండా, అతన్ని హత్య చేసి.. తల, మొండెం భాగాలను వేరుచేసి వేర్వేరు ప్రాంతా

Advertiesment
అక్క గర్భానికి ఫ్రెండే కారణమని మర్మాంగాన్ని కోసేసిన అన్నదమ్ములు
, శనివారం, 16 సెప్టెంబరు 2017 (15:47 IST)
తమ అక్క పెళ్లి కాకుండానే గర్భందాల్చడానికి ప్రధాన కారణం తమ స్నేహితుడు కావడంతో అతని మర్మాంగాన్ని ఇద్దరు అన్నదమ్ములు కోసేశారు. అంతేకాకుండా, అతన్ని హత్య చేసి.. తల, మొండెం భాగాలను వేరుచేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈనెల 11వ తేదీన బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలోని దొడ్డతోగూరు మైదానం వద్ద తలలేని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా, మర్మాంగం కూడా లేదని గుర్తించారు. దీంతో ఇదో దారుణమైన హత్యగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ దర్యాప్తులో భాగంగా, హత్యకు గురైన వ్యక్తి ఒడిషాకు చెందిన బిరాంచి మాంజీగా గుర్తించారు. దీంతో హత్య ఎందుకు జరిగిందనే కోణంలో విచారణ ప్రారంభమైంది. దొడ్డతోగూరులోని గోవిందప్ప నివాసంలో ఉండే బిరాంచితో కలిసివుండే మరో ఒడిషాకు చెందిన గాంధీ జె.రాయ్‌ (19) మధు జె.రాయ్‌ (21) అన్నదమ్ములను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. ఈ విచారణలో అసలు నిజాన్ని వెల్లడించారు. 
 
ఈ ఇద్దరు సోదరులకు సాంబారి జే.రాయ్‌, సాబిత్రి జే.రాయ్‌లు అనే ఇద్దరు అక్కలు ఉండగా, వీరిద్దరూ నగరంలోని ఓ గార్మెంట్స్‌లో పనిచేస్తున్నారు. అయితే, సాంబారికి వివాహం కాగా భర్త కాశీరాం ఒడిషాలో నివసిస్తున్నాడు. అయితే, ఇటీవలే సాబిత్రి సొంతూరుకు వెళ్ళి వెనుతిరిగి వస్తుండగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆసుపత్రిలో చేర్చగా, ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తేల్చారు. 
 
అందుకు గల కారణాలను ఆరా తీయగా బిరాంచి వల్లనే ఆమెకు గర్భం వచ్చినట్లు తెలిపింది. దీంతో ఆగ్రహించిన రాయ్ సోదరులు.. పథకం ప్రకారం బిరాంచిని మద్యం సేవించేందుకు తీసుకెళ్ళి హతమార్చారు. సంఘటనా స్థలానికి సమీపంలోనే తల భాగం లభించింది. ఈ మేరకు ఇరువురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్ ధరలు కావాలనే పెంచుతున్నాం.. బైకులు ఉన్నోళ్లు ఉన్నతశ్రేణి వ్యక్తులు: కేంద్ర మంత్రి