Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినాయక చతుర్థి: ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 1:39గంటల్లోపు పూజ చేయండి

వినాయక చతుర్థి పండుగ పది రోజుల పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 25న ఈ పండుగ వస్తోంది. సెప్టెంబర్ ఐదో తేదీన గణేశ నిమజ్జనానికి ముహూర్తం ఖరారైంది. ఈ వినాయక చవితి

వినాయక చతుర్థి: ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 1:39గంటల్లోపు పూజ చేయండి
, బుధవారం, 23 ఆగస్టు 2017 (13:06 IST)
వినాయక చతుర్థి పండుగ పది రోజుల పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 25న ఈ పండుగ వస్తోంది. సెప్టెంబర్ ఐదో తేదీన గణేశ నిమజ్జనానికి ముహూర్తం ఖరారైంది. ఈ వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఈ విధంగా పూజ చేయాలి. గణపతికి మోదకాలంటే ఇష్టం. పూజకు సమర్పించే నైవేద్యాల్లో ఏది లేకపోయినా మోదకాలు తప్పకవుండాలి. 
 
గణేశ పూజ ద్వారా మానసిక ప్రశాంతత, విజ్ఞానం, కార్యసిద్ధి చేకూరుతుంది. విఘ్నాలు తొలగిపోతాయి. వినాయకుడి పూజ కోసం చతుర్థి రోజున మధ్యాహ్న సమయంలో పూజిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. ఎందుకంటే గణపతి మధ్యాహ్నం పూట జన్మించడంతో మధ్యాహ్న సమయంలో ఆయనను పూజించడం ద్వారా సకలసంపదలు ప్రాప్తిస్తాయి. 
 
ఈ ఏడాది చతుర్థి తిథి ఆగస్టు 24, 2017 (గురువారం) రాత్రి 8.27 నుంచి ఆగస్టు 25, 2017 (శుక్రవారం) రాత్రి 08.31కి ముగుస్తుంది. గణేశ పూజ శుక్రవారం మధ్యాహ్నం 11:06 నుంచి 1:39గంటల్లోపు పూర్తి చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే చవితి రోజున సాయంత్రం పూట మాత్రం వినాయక పూజ చేయకూడదు. సాయంత్రం చేస్తే చంద్రుని కారకంగా దోషాలు ఏర్పడుతాయి. 
 
విఘ్నేశ్వరుని పూజ ఎలా చేయాలి? 
ప్రాతఃకాలంలోనే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. పూజా గదిని, గడపను తోరణాలతో అలంకరించుకోవాలి. రంగవల్లికలు దిద్దుకోవాలి. షోడశోపచార పూజ చేయాలి. ఉపవాసం వుండే భక్తులు తప్పకుండా పూజలో పాల్గొని దీపారాధన చేయాలి. సంకల్పం చేసుకోవాలి. మట్టి గణపతిని తెచ్చుకుని.. గంధం, పువ్వులు, కుంకుమలతో అలంకరించుకోవాలి. 
 
ఆపై పీటపై వినాయకుడిని వుంచేందుకు ముందు.. అక్షింతలు పువ్వులు సిద్ధం చేసుకోవాలి. పీటపై తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం వేసి.. గణపతిని వుంచాలి. వ్రతమాచరించే భక్తులు పాలు, ఫలాలను తీసుకోవచ్చు. మోదకాలు, 21 పత్రాలు, పండ్లతో వినాయకునికి నైవేద్యం సమర్పించి దీపారాధన చేయాలి. గణనాథుని ప్రతిమ ఇంట్లో వున్నంతకాలం ఆయనకు చేతనైన నైవేద్యాలు సమర్పించాలి. నిమజ్జనం చేసే రోజున కూడా ఆయన నైవేద్య సమర్పణ చేయాలి. దీపారాధనకు ముందు విఘ్నేశ్వరుని శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళితో స్తుతించడం మరిచిపోకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : మీ రాశి ఫలితాలు 23-08-17