పిల్లలు వద్దన్నా బలవంతంగా అన్నాన్ని నోట్లో కుక్కేస్తున్నారా? అలా చేయొద్దు..?

పిల్లలు వద్దు వద్దు అంటున్నా.. పోషకాహారం తినాలని అన్నీ ఆహార పదార్థాలను బలవంతంగా నోళ్ళల్లో పెట్టి కుక్కేయకూడదంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలు తినే విధానంలో మార్పు రావడం వల్ల ఊబకాయం సమస్య తలెత్తు

గురువారం, 17 ఆగస్టు 2017 (10:26 IST)
పిల్లలు వద్దు వద్దు అంటున్నా.. పోషకాహారం తినాలని అన్నీ ఆహార పదార్థాలను బలవంతంగా నోళ్ళల్లో పెట్టి కుక్కేయకూడదంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలు తినే విధానంలో మార్పు రావడం వల్ల ఊబకాయం సమస్య తలెత్తుతోందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలు ఆహారం తీసుకునే విషయంలో.. తినిపించే విషయంలో బలవంతపెట్టకూడదని వారు సూచిస్తున్నారు. 
 
పిల్లలకు ఆకలి లేదన్నా బలవంతంగా తిండి తినిపించడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. పిల్లలకు తల్లులు బలవంతంగా తిండి తినిపించడం ద్వారా సాధారణంగా పిల్లలు ఆకలేస్తే అన్నం తీసుకునే అలవాటు రాదు. పిల్లలు ఊబకాయం బారిన పడే ప్రమాదం సైతం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
ఆహారాన్ని బలవంతంగా తినిపిస్తే.. శరీరం ఇచ్చే సిగ్నల్స్‌కు అనుగుణంగా ఆహారాన్ని తినే అలవాటును చిన్నారులు పోగొట్టుకుంటున్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు. సో.. ఇకపై ఆకలేస్తుందంటేనే పిల్లలకు ఆహారం తినిపించాలి. అదీ వారుగా ఇష్టపడి తినేలా అలవాటు చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నలభై ఏళ్లు దాటాక స్త్రీ,పురుషుల పరిస్థితి ఇంతే... ఐతే?