Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీడితోటలోకి లాక్కెళ్లి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి ఇంటికి తిరిగివస్తున్న ప్రియురాలిపై ప్రియుడు కళ్లెదుటే సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను ప

Advertiesment
జీడితోటలోకి లాక్కెళ్లి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్
, గురువారం, 19 అక్టోబరు 2017 (13:29 IST)
ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి ఇంటికి తిరిగివస్తున్న ప్రియురాలిపై ప్రియుడు కళ్లెదుటే సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిశాలోని గంజాం జిల్లా భంజానగర్‌కు చెందిన ఓ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ప్రియుడితో కలిసి బుధకెందు తాకూరాణి దేవాలయానికి వెళ్లింది. దేవాలయంలో పూజలు చేసి ఇంటికి తిరుగు ప్రయాణమైన ప్రేయసీప్రియులను రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు యువకులు అటకాయించారు. 
 
వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రియుడిపై దాడి చేశారు. అనంతరం వారిద్దరినీ దగ్గర్లోని జీడితోటలోకి లాక్కెళ్లి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి తెగబడడమే కాకుండా, అదేదో ఘనకార్యమైనట్టు సెల్ ఫోన్లలో వీడియో కూడా తీశారు. 
 
దారుణం అనంతరం వారిద్దరినీ అక్కడే వదిలేయగా, వారిద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఆరుగురు కీచకులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉ.కొరియా తొలి బాంబు పడేంత వరకు వేచి చూస్తాం.. అమెరికా