ఉ.కొరియా తొలి బాంబు పడేంత వరకు వేచి చూస్తాం.. అమెరికా
ఉత్తర కొరియా, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తమ భూభాగంపై ఉత్తర కొరియా విసిరే తొలి బాంబు పడేంతవరకు వేచి చూస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. అంటే చివర
ఉత్తర కొరియా, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తమ భూభాగంపై ఉత్తర కొరియా విసిరే తొలి బాంబు పడేంతవరకు వేచి చూస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. అంటే చివరి నిమిషం వరకు ఉ.కొరియాతో దౌత్య చర్చలకే మొగ్గు చూపుతామని చెప్పకనే చెప్పింది.
కానీ, ఉత్తర కొరియా పరిస్థితి మరోలా ఉంది. నిత్యం రెచ్చగొట్టే చర్యలతో మరింతగా దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఏ చిన్న ప్రమాదం చోటుచేసుకున్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈనేపథ్యంలో బయటపడ్డ శాటిలైట్ చిత్రాలు మరింత ఆందోళనను పెంచుతున్నాయి. తాజాగా వెలువడిన శాటిలైట్ చిత్రాల్లో ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపానికి క్షిపణులను తరలిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా క్షిపణులను తరలించడం, రాజధాని పరిసరాల్లో వాటిని మోహరింపజేసేందుకేనని, ఈ నేపథ్యంలోనే ఊహించని సమయంలో ఊహకందని దాడులతో విరుచుకుపడతామని అమెరికాను కిమ్ జాంగ్ ఉన్ తీవ్రంగా హెచ్చరించారు. అయతే, ప్రపంచ దేశాల మాత్రం ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాయి.