Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏంటది?

భారతీయ రైల్వేలో పని చేసే సిబ్బందికి ఓ బంపర్ ఆఫర్. అదేంటంటే... ఉద్యోగ విరమణ చేసినప్పటికీ రెండేళ్ళ పాటు తమ విధుల్లో కొనసాగవచ్చు. అంటే.. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సేవలను మరో రెండేళ్ళ పాటు వినియోగించుకునేందు

రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏంటది?
, గురువారం, 19 అక్టోబరు 2017 (12:27 IST)
భారతీయ రైల్వేలో పని చేసే సిబ్బందికి ఓ బంపర్ ఆఫర్. అదేంటంటే... ఉద్యోగ విరమణ చేసినప్పటికీ రెండేళ్ళ పాటు తమ విధుల్లో కొనసాగవచ్చు. అంటే.. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సేవలను మరో రెండేళ్ళ పాటు వినియోగించుకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది. 
 
వీరిని డివిజన్ మేనేజర్‌ల విచక్షణాధికారంతో వీరిని నియమించుకోవచ్చు. పింఛన్‌దారులను కూడా తీసుకోవచ్చని ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా నియమితులైన వారు తమకు 62 ఏళ్లు నిండేవరకు మాత్రమే కొనసాగడం వీలవుతుంది. 
 
ప్రస్తుతం రైల్వే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు. అంటే గరిష్టంగా రెండేళ్లపాటు సేవలు అందించవచ్చు. ఉద్యోగిగా ఉన్నప్పుడు చివరి నెలలో తీసుకున్న జీతం నుంచి పింఛన్‌ మొత్తాన్ని మినహాయించి, ఇలాంటివారికి పారితోషికాన్ని నిర్ణయిస్తారు.
 
భద్రతతో ముడిపడిన విభాగాల్లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నవారికి, సరళీకృత పదవీ విమరణ పథకాన్ని ఉపయోగించుకున్నవారికి… ఇలా కొన్ని విభాగాలకు మాత్రం ఈ అర్హత ఉండదు. తీసుకోబోయేవారి సామర్థ్యం, భద్రతపరమైన రికార్డులు, వైద్య ప్రమాణాలు వంటివి చూసుకున్నాక వీరిని ఎంపిక చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్కా ప్లాన్‌తో మట్టుబెట్టాడా? ప్రభాకర్‌రెడ్డే హంతకుడా?