Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

మీ అమ్మాయితో పూజ చేయిస్తా... 19 ఏళ్ల యువతిని గదిలోకి తీసుకెళ్లి...

డేరా బాబా రాసలీలల పరంపరం గురించి చర్చ జరుగుతూ వుండగానే మరో రేప్ బాబా బాగోతం బయటకు వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని జైన్ ముని ఆచార్య శాంతినగర్‌లో వున్న జైన్ పూజారి 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యం చేశాడు. తొలుత యువతి ఈ విషయాన్ని చెప్పేందుకు భయపడింది. కానీ ఆ తర

Advertiesment
Gujarat Crime
, మంగళవారం, 17 అక్టోబరు 2017 (15:08 IST)
డేరా బాబా రాసలీలల పరంపరం గురించి చర్చ జరుగుతూ వుండగానే మరో రేప్ బాబా బాగోతం బయటకు వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని జైన్ ముని ఆచార్య శాంతినగర్‌లో వున్న జైన్ పూజారి 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యం చేశాడు. తొలుత యువతి ఈ విషయాన్ని చెప్పేందుకు భయపడింది. కానీ ఆ తర్వాత ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాలను చూస్తే... జైన్ ఆలయంలో 45 ఏళ్ల శాంతిసాగర్ అనే వ్యక్తి పూజారిగా వున్నాడు. తనవద్దకు వచ్చిన వారికి స్వాంతన కలిగిస్తానని విశ్వాసం కల్పిస్తుండేవాడు. ఆ క్రమంలో బాధితురాలి కుటుంబం మహావీర్ దిగంబర్ జైన్ మందిరానికి గత శనివారం నాడు వచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన 19 ఏళ్ల యువతిపై అతడి కన్ను పడింది. 
 
దీనితో తల్లిదండ్రులు, బాధితురాలి సోదరుడిని మందిరంలోనే వుండి మంత్రాలను పెద్దగా ప్రార్థించమని చెప్పి, మీ అమ్మాయితో ప్రత్యేక పూజ చేయిస్తానని లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు పొక్కితే అపాయం జరుగుతుందని ఆమెను భయపెట్టడంతో చెప్పేందుకు జంకిన యువతి ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దానితో పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయ్యింది. దీనితో సదరు పూజారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవాల మిస్టరీ... ఐదుగురు ఆత్మహత్య.. అన్నీ అనుమానాలే?