Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిఫ్ట్ బాక్సులో బాంబు పెట్టి పెళ్లి కుమారుడిని చంపేశారు.. ఎక్కడ?

సాధారణంగా టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అనేక క్రైమ్ చిత్రాలు నిర్మించాడు. ఈ చిత్రాల్లో గిఫ్టు బాక్సుల్లో బాంబులు పెట్టి ప్రత్యర్థులను హతమార్చే సీన్లు కనిపిస్తుంటాయి.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (13:28 IST)
సాధారణంగా టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అనేక క్రైమ్ చిత్రాలు నిర్మించాడు. ఈ చిత్రాల్లో గిఫ్టు బాక్సుల్లో బాంబులు పెట్టి ప్రత్యర్థులను హతమార్చే సీన్లు కనిపిస్తుంటాయి. అచ్చం ఇలాంటి దృశ్యమే ఇపుడు ఒకటి రియల్‌గా జరిగింది. ఒడిషా రాష్ట్రంలోని బోలన్ గిరి జిల్లాలో పట్నఘర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తితో రీనా అనే యువతి పెళ్లి ఈనెల 18వ తేదీ జరిగింది. 21వ తేదీ సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి బంధుమిత్రులంతా వచ్చారు. అలా వచ్చిన వారిలో పలువురు గిఫ్టు బాక్సులూ కూడా ఇచ్చారు. ఆ రాతంత్రా హ్యాపీగా సాగింది. 23వ తేదీ ఉదయం ఇంట్లో వచ్చిన గిఫ్ట్ ప్యాక్‌లను వరుడు కుటుంబ సభ్యుల ఓపెన్ చేయడం ప్రారంభించారు. 
 
పెళ్లి కుమారుడు సోమశేఖర్ ఓ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే అది పేలింది. అందులో బాంబ్ పెట్టారు. ఓపెన్ చేయగానే పేలిపోయే విధంగా అమర్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయ్యింది. గిఫ్ట్ బాంబ్ పేలుడుతో పెళ్లి కుమారుడు సోమశేఖర్, అతని నానమ్మ జమామొన్నీసా చనిపోయింది. 
 
పెళ్లి కూతురు రీనా తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. గిఫ్ట్ బాంబ్ ఇచ్చింది ఎవరు.. ఎందుకు ఇలా చేశారు అనేదానిపై విచారణ చేస్తున్నారు. రిసెప్షన్ వీడియో పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments