Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరాన్‌లో కూలిన విమానం... 66 మంది మృత్యువాత

ఇరాన్‌లో విమాన ప్రమాదం జరిగింది. 66 మంది ప్రయాణిస్తున్న విమానమొకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులంతా చనిపోయారు. టెహ్రాన్ నుంచి యసుజ్ నగరానికి వెళ్తున్న ఈ విమానంలో క్రూ సిబ్బ

Advertiesment
ఇరాన్‌లో కూలిన విమానం... 66 మంది మృత్యువాత
, ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (14:46 IST)
ఇరాన్‌లో విమాన ప్రమాదం జరిగింది. 66 మంది ప్రయాణిస్తున్న విమానమొకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులంతా చనిపోయారు. టెహ్రాన్ నుంచి యసుజ్ నగరానికి వెళ్తున్న ఈ విమానంలో క్రూ సిబ్బందితో కలుపుకుని 66 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
 
టెహ్రాన్ నుంచి 620 కి.మీ. దూరంలో, సెమిరోమ్‌ పట్టణం సమీపంలోని జాగ్రోస్ పర్వత ప్రాంతంలో ఈ విమానం కూలినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 15 రోజుల వ్యవధిలో విమానం కూలిపోయిన రెండో ఘటన ఇది. 
 
కాగా, గత వారం రష్యాలోనూ ఇదే విధంగా ఓ విమానం కూలిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే మాస్కో సమీపంలో విమానం కూలిపోవడంతో 71 మంది మృతి చెందారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం పనుల్లో చంద్రబాబుకు ముడుపులు అందాయ్ : జైరాం రమేష్