ఆ సర్టిఫికేట్ లేకుంటే వాహనం స్వాధీనం.. కేంద్రం కొత్త చట్టం

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (12:34 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కొత్త చట్టం తెచ్చింది. ఇది వచ్చేయేడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. తమ వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తీసుకోని వారిపై మరింత కఠినంగా వ్యవహరించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. 
 
పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ను స్వాధీనం చేసుకునేలా జనవరి నుంచి కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఈ మేరకు ముసాయిదాను తయారు చేసిన కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది.
 
కాగా, ఈ నూతన వ్యవస్థలో భాగంగా అన్ని వాహనాల యజమానుల వివరాలను మోటార్ వాహనాల డేటాబేస్‌కు అనుసంధానించిన సర్వర్లలో పొందుపరుస్తారు. ఏదైనా వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు పీయూసీ లేకుంటే, వారం రోజుల గడువు ఇస్తారు. 
 
వారంలోగా పొల్యూషన్ సర్టిఫికెట్‌ను తీసుకోకుంటే, ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకుంటారు. వాహనాల ద్వారా విడుదలవుతున్న కాలుష్యం ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
 
ఇదేసమయంలో అన్ని రకాల వాహనాల పీయూసీ సర్టిఫికెట్ల జారీని కూడా మారుస్తూ, ఒకే రకమైన సర్టిఫికెట్‌ను ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కొత్త సర్టిఫికెట్‌లో క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే, వాహన యజమాని, వాహనం వివరాలు, అది విడుదల చేస్తున్న కాలుష్య ఉద్గరాల పరిమాణం వంటి వివవరాలన్నీ ఉంటాయి.
 
అంతేకాకుండా, పీయూసీ తీసుకోవడానికి ముందే యజమాని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ కూడా వచ్చేలా నూతన వ్యవస్థ పనిచేయనుంది. ఈ విధానంలో వాహనాల దొంగతనాలను కూడా నివారించవచ్చని కేంద్రం భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments