Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రాఫిక్ పోలీస్ కారుపై దూకేశాడు.. అయినా డ్రైవర్ ఆపలేదు.. చివరికి..?

Advertiesment
Delhi
, గురువారం, 15 అక్టోబరు 2020 (13:35 IST)
traffic police
కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలకు పాల్పడిన వ్యక్తులు.. ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు వేగంగా కారునో, బైకునో నడుపుకుంటూ పారిపోతుంటారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి షాకింగ్ ఘటన జరిగింది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు ఆపడానికి కారు ముందు భాగంపై దూకాడు. 
 
ఈ వీడియో విస్తృతంగా వైరల్ అయింది. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించిన ఒక కారుని ఆపడానికి ఢిల్లీలోని ధౌలా కువాన్‌‌లో ఆన్-డ్యూటీ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేసారు. అయినా సరే కారు డ్రైవర్ కారు ఆపలేదు. 
 
దీనితో ట్రాఫిక్ కానిస్టేబుల్ కారుపై దూకారు. ఆ తర్వాత కారుని మాత్రం సదురు వ్యక్తి ఆపలేదు. ఈ వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాలో వైరల్ అయింది. ఈ ఘటన ఈ నెల 12న జరిగింది. ఆ తర్వాత కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు పోలీస్ స్టేషన్లో కారు డ్రైవర్ శుభంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
కారును ఆపేందుకు ఎంత పోరాడినా డ్రైవర్ ఆపకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆయన కారుపై దూకాడని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోదీ ఆస్తులు విలువెంతో తెలుసా? జీతం రూ.2లక్షలు