Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదవులు - అధికారం ఏదీ శాశ్వతం కాదు - కర్నాటక సీఎం : మార్పు ఖాయమా?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (08:07 IST)
కర్నాటక రాష్ట్రంలో మరోమారు అధికార మార్పిడి సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మరోమారు మార్చే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం బసవరాజ్ బొమ్మై స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి బొమ్మై చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. 
 
ఇటీవల తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్థానికులతో మాట్లాడుతూ, పదవులు, అధికారం ఏదీ శాశ్వతం కాదని చెప్పారు. ప్రజలు ప్రేమ మాత్రమే ఒక్కటే శాశ్వతమని, అది చాలని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకునే నడుచుకుంటున్నానని చెప్పారు. 
 
పైగా, నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ బసవరాజ్‌ను మాత్రమేనని, ముఖ్యమంత్రిని కాదని చెప్పారు. గతంలో హోం శాఖామంత్రిగా, సాగునీటి మంత్రిగా పని చేశానని గుర్తుచేసిన సీఎం బసవరాజ్... తాను ఎపుడు ఇక్కడు వచ్చినా బసవరాజ్‌గానే వస్తానని, తాను చేపట్టే పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటాడని భావోద్వేగంగా చెప్పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments