Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ ఎమ్మెల్యే నోటి దురద - సారీ చెప్పిన మాజీ సభాపతి

Advertiesment
Karnataka Cong MLA
, శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:57 IST)
నోటి దూల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎట్టకేలకు సారీ చెప్పారు. మహిళల మనసులు గాయపరిచివుంటే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. అత్యాచారం నుంచి తప్పించుకునే వీలులేనపుడు దాన్ని ఆస్వాదించడమే మేలు అంటూ కర్నాటక రాష్ట్రానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. 
 
పైగా, తాను సభాపతిగా ఉన్న సమయంలోనూ తాను అత్యాచార బాధితారాలి పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ గుర్తుచేశారు. ఈయన గత 2019లో సభాపతిగా ఉన్నారు. ఆ సమయంలో తన పరిస్థితి అత్యాచారం బాధితురాలిగా ఉందంటూ వ్యాఖ్యలు చేసి పెను దుమారాన్నే రేపారు. 
 
"అత్యాచారం జరిగినపుడు అంతటితో అక్కడ వదిలేస్తే సరిపోతుంది. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు, న్యాయవాదులు వచ్చి ఎన్నిసార్లు జరిగింది. ఎలా జరిగింది. ఎంతమంది చేశారు ఇత్యాది ప్రశ్నల వర్షం కురిపిస్తారు. సాధారణంగా అత్యాచారం ఒక్కసారే జరుగుతుంది. కానీ, కోర్టు వందసార్లు జరుగుతుంది. ఇపుడు నా పరిస్థితి అలానేవుంది" అని అప్పట్లో వ్యాఖ్యానించి సంచలనం రేపారు. 
 
తాజాగా, అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కర్నాటక రాష్ట్రంలో సంభవించిన వరదలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో వాడివేడిగా చర్చ సాగింది. అధికార, విపక్ష సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. దీంతో సభను నియంత్రించడం స్పీకర్‌ విశ్వేశ్వర్‌కు కష్టంగా మారింది. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ, పరిస్థితిని నియంత్రించేందుకు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని అనుకుంటున్నాను. మాట్లాడుకోండి అని అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై కల్పించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్... "అత్యాచారం అనివార్యమైనపుడు దానిని ఆస్వాదించడమే మేలు" అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్తాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన దిగివచ్చిన మహిళా లోకానికి సారీ చెప్పారు. 
 
తన వ్యాఖ్యలు మహిళల మనస్సులను గాయపరిచివుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఇదే అంశంపై కర్నాటక స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కూడా స్పందించారు. సభలో రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారని, అందువల్ల దీనిపై వివాదం చేయొద్దని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేయాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్న ధర్మపురి శ్రీనివాస్