దేశంలో ఒమిక్రాన్ వైరస్ వేరియంట్ క్రమంగా పాగా వేస్తోంది. ఆదివారం ఒక్తగా మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, కర్నాటకలో మరో కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. అయితే, కర్నాటకలో ఆదివారం నమోదైన కేసుతో కలుపుకుని మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది.
మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు కూడా కర్నాటకలోనే నమోదైన విషయం తెల్సిందే. సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ తొలుత వెలుగుచూసింది. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు.
ఈ నేపథ్యంలో కర్నాటకలో నమోదైన మూడో కేసు కూడా సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలోనే వెలుగు చూడటం గమనార్హం. ఇదే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ సోకిన వ్యక్తి నుంచి ఐదు ప్రాథమిక కాంటాక్టులను, 15 సెకంటరీ కాంటాక్టులను గుర్తించామని, వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపామని వివరించారు.