Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీడ్‌టెస్టులో పాల్గొన్న గడ్కరీ - 170 కిమీ వేగంతో దూసుకెళ్లిన కియా కారు

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (17:18 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధైర్యమెక్కువ. ఆయనకు రహదారుల్లో అమిత వేగంతో ప్రయాణించడమంటే చాలా ఇష్టం. అందుకే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా తయారు చేసిన కొత్త కారు స్పీడ్ టెస్టులో మంత్రి స్వయంగా పాల్గొన్నారు. ఆ కారు ఏకంగా 170 కిమీ వేగంతో దూసుకెళ్లింది. ఈ స్పీడ్ టెస్ట్ ఓ జాతీయ రహదారిపై నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. ఈ టెస్టులో గడ్కరీ స్వయంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 
 
ఢిల్లీ-ముంబై మధ్య కొత్తగా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలను కలిపేందుకు ఉద్దేశించిన ఈ ఎక్స్‌ప్రెస్ హైవే 1,380 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత పొడవైన రహదారిగా చరిత్రకెక్కనుంది. 
 
ప్రస్తుతం 8 లేన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ రహదారిని భవిష్యత్తులో 12 లేన్లకు విస్తరించనున్నారు. కాగా, ఎనిమిది లేన్లలో నాలుగు లేన్లు కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేటాయిస్తుండడం విశేషం. ఈ భారీ రహదారి కోసం రూ.98 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ రహదారి ద్వారా ఢిల్లీ, ముంబై నగరాల మధ్య ప్రయాణ దూరం 12 గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు.
 
ఈ హైవే పరిశీలన కోసం గడ్కరీ రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్ ప్రెస్ హైవే నిర్దేశిత ప్రమాణాల మేర నిర్మాణం జరుపుకుంటోందా, లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ రహదారిపై స్పీడ్ టెస్టుకు వెళ్లిన గడ్కరీ కియా కార్నివాల్ కారులో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. 
 
ఆయనతో పాటు కారులో అధికారులు కూడా ప్రయాణించారు. ఆయన డ్రైవరు పక్క సీటులో కూర్చొనగా, ఓ దశలో కారు స్పీడోమీటర్ ముల్లు 170 కిలోమీటర్లను సూచించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 
 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments