పరప్పన జైలులో యూనిఫామ్ వేసుకోని శశికళ, ఇళవరసి..

అక్రమాస్తుల కేసులో జైలు జీవనం గడుపుతున్న చిన్నమ్మ శశికళ మళ్లీ వార్తల్లోకెక్కింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ.. జైలులో వుండట్లేదని హ్యాప

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (12:25 IST)
అక్రమాస్తుల కేసులో జైలు జీవనం గడుపుతున్న చిన్నమ్మ శశికళ మళ్లీ వార్తల్లోకెక్కింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ.. జైలులో వుండట్లేదని హ్యాపీగా షాపింగ్‌కు వెళ్తూ షికార్లు చేస్తుందని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీకే శశికళ, ఆమె బంధువు ఇళవరసి ఖైదీల యూనిఫాం ధరించడం లేదని నేషనల్ కమిషన్ ఫర్ ఉమన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. 
 
తనిఖీల్లో భాగంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లగా అక్కడ శశికళ, ఇళవరసి ఇద్దరూ యూనిఫామ్ ధరించలేదని.. మహిళా ఖైదీలు ధరించే దుస్తులు కాకుండా సొంత దుస్తులను ధరించారని తెలిపారు. దానిపై తాను జైలు సిబ్బందిని ప్రశ్నించగా, శశికళ ఉన్నత స్థాయికి చెందిన వారని, ఆమె సొంత బట్టలు వాడుకోవచ్చని సమాధానమిచ్చివట్లు రేఖా శర్మ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. ఇటీవల బెంగళూరు జైలులో శశిక‌ళ‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నార‌ని నిజాలను బయటపెట్టిన కర్ణాటక జైళ్లశాఖ డీఐజీ రూపను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ డీఐజీ పదవి నుంచి తప్పించిన రూపను.. ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేశారు. రూప గతంలో శశికళకు పరప్పన జైలులో రాచమర్యద ఇస్తున్నారని, రూ.2 కోట్ల లంచం తీసుకుని శ‌శిక‌ళ‌కు వీఐపీ సౌక‌ర్యాలు క‌లిపిస్తున్నార‌ని రూప మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments