Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మకు ప్రత్యక్ష వారసులు లేరు... అమృతకు వేదనిలయం ఇచ్చేది లేదు

తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మం

అమ్మకు ప్రత్యక్ష వారసులు లేరు... అమృతకు వేదనిలయం ఇచ్చేది లేదు
, సోమవారం, 8 జనవరి 2018 (12:19 IST)
తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మందిరమేనని తమిళ సర్కారు వెల్లడించింది. వేద నిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెన్నై జిల్లా కలెక్టర్ అన్బుసెల్వన్ తెలిపారు. 
 
అయితే జయలలితకు తాను పుట్టిన బిడ్డనని బెంగళూరుకు చెందిన అమృత తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. జయకు వారసులు లేరని ప్రకటించడంపై అన్బుసెల్వన్ మాట్లాడుతూ.. ఒకవేళ భవిష్యత్తులో ఆధారాలతో అమృత వస్తే.. అప్పటికి వేదనిలయానికి వెల కట్టడం జరుగుతుందే కానీ.. వేదనిలయాన్ని అప్పగించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేశారు. అంతేగాకుండా అమ్మకు వారసులు ఎవరూ లేరని, ఒకవేళ ఉండివుంటే, ఆమె బహిరంగంగా ఎన్నడో ప్రకటించేవారని చెప్పారు. వేదనిలయంలో రహస్యంగా గదులు ఉన్నాయా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
 
కాగా, ఇప్పటికే అన్బు సెల్వన్ నేతృత్వంలోని 20 మంది అధికారులు వేదనిలయం స్థలం కొలతలు, ఆస్తి విలువ, తదితరాలను గణించారన్న సంగతి తెలిసిందే. అందులోని రెండు గదులను ఐటీ అధికారులు సీజ్ చేయడంతో, అందులో ఏముందోనన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎనిమిది మందిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు.. రూ.4.5కోట్లు గుంజేశాడు