జయలలిత వీడియోతోనే దినకరన్‌కు గెలుపు.. డబ్బే గొప్పది: కేతిరెడ్డి
ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు దివంగత సీఎం జయలలిత ఆస్పత్రి వీడియోను విడుదల చేయడం శశికళ మేనల్లుడు దినకరన్‌కు కలిసొచ్చిందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యాన
ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు దివంగత సీఎం జయలలిత ఆస్పత్రి వీడియోను విడుదల చేయడం శశికళ మేనల్లుడు దినకరన్‌కు కలిసొచ్చిందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు.
లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను తెరకెక్కించనున్న కేతిరెడ్డి ఆర్కేనగర్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆర్కే నగర్‌లో ఎక్కువగా నిరుపేద ఓటర్లు వున్నారు. వారికి భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారు. దినకరన్ గెలుపుకు ఇదే కారణమని, రెండాకుల గుర్తు వచ్చిందనే ధీమాలో అన్నాడీఎంకే ఉండిపోయిందని... గుర్తు కంటే డబ్బే గొప్పది అనే విషయాన్ని వారు మరిచిపోయారని కేతిరెడ్డి చెప్పారు.
తమిళనాడులో బీజేపీ వచ్చే ఛాన్స్ లేదని.. ఈ ఎన్నికల్లో తేలిపోయిందని చెప్పారు. దినకరన్ గెలుపుతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. దినకరన్ విజయానికి, అన్నాడీఎంకే ఓటమికి తెలుగు ఓటర్లే కారణమని చెప్పారు.
హీరో విశాల్ నామినేషన్‌ను అధికార అన్నాడీఎంకే నేతలు రద్దు చేయించారనే ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీని దెబ్బతీసిందని అన్నారు. దినకరన్ గెలుపుకు కేవలం డబ్బు మాత్రమే కారణమని.. ఇప్పటి వరకు ఆర్కేనగర్‌కు ఏం చేశారో దినకరన్ చెప్పాలని డిమాండ్ చేశారు.