Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళ కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి.. రాజకీయాలు నడిపింది..

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ శుక్రవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. తన భర్తకు అనారోగ్యంగా ఉన్న కారణంగా.. ఆయనకు తన సేవల అవసరం ఉందని, 15 రోజులు పెరోల్ కా

Advertiesment
శశికళ కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి.. రాజకీయాలు నడిపింది..
, ఆదివారం, 8 అక్టోబరు 2017 (10:44 IST)
అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ శుక్రవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. తన భర్తకు అనారోగ్యంగా ఉన్న కారణంగా.. ఆయనకు తన సేవల అవసరం ఉందని, 15 రోజులు పెరోల్ కావాలని కోరి, ఐదు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన శశికళ, కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి, రాజకీయాలు నడుపుతున్నట్టు  సమాచారం.
 
గ్లోబల్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజ్‌ను పరామర్శించిన శశికళ అక్కడే ఉన్నారు. శశికళలతో పాటు టీటీవీ దినకరన్, మన్నార్ గుడి సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. శశికళను రాజకీయ నాయకులు ఎవరైనా కలుస్తారా అంటూ ఇంటలిజెన్స్ అధికారులతో పాటు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నారు. కేవలం గంటన్నర పాటు మాత్రమే ఆస్పత్రిలో గడిపారు. అక్కడ కూడా ఆమె నటరాజన్ ఉన్న గది వైపు కూడా వెళ్లలేదని, కేవలం డాక్టర్లతో మాత్రం మాట్లాడారని తెలుస్తోంది.
 
ఇక శుక్రవారం నాడు పెరోల్ పై జైలు గోడలు దాటి బయటకు వచ్చిన శశికళ, శనివారం మధ్యాహ్న సమయంలో ఓ రెండు గంటలు మినహా మిగతా కాలాన్ని రాజకీయాలకే వెచ్చించినట్టు సమాచారం. తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన వారిని పలకరించిన శశి, తన వర్గం అన్నాడీఎంకే నేతలను రహస్యంగా పిలిపించుకుని మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ సమావేశాలు పెట్టుకోరాదన్న కోర్టు నియమాలను ఆమె ధిక్కరించిందని తమిళ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజవాడలో ఫాస్టర్ రాసలీలలు: అమ్మాయిలతో సన్నిహితంగా వుంటూ...