ఆపరేషన్ క్లీన్ మనీపై కమల్ హాసన్ ఏమన్నారంటే?
తమిళనాట చోటుచేసుకున్న ఐటీ దాడులపై సినీ లెజండ్.. కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రభుత్వం దోపిడీలకు పాల్పడితే అది నేరం. కానీ నేరం బయటపడిన తర్వాత కూడా ఒప్పుకోకపోవడం నేరం కాదా? అంటూ ప్రశ్నించార
తమిళనాట చోటుచేసుకున్న ఐటీ దాడులపై సినీ లెజండ్.. కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రభుత్వం దోపిడీలకు పాల్పడితే అది నేరం. కానీ నేరం బయటపడిన తర్వాత కూడా ఒప్పుకోకపోవడం నేరం కాదా? అంటూ ప్రశ్నించారు. ఐటీ అధికారులు ఆపరేషన్ క్లీన్ మనీ పేరిట నిర్వహించిన దాడుల్లో శశికళ కుటుంబసభ్యులు వందల కోట్ల విలువైన బినామీ ఆస్తులు పోగేసిన వైనం వెల్లడైన సంగతి తెలిసిందే. ఇక క్రిమినల్ రాజ్యం సాగదని.. ప్రజలు న్యాయమూర్తులుగా మారాలని మేల్కొనాలని పిలుపునిస్తూ ట్వీట్ చేసారు.
తమిళనాట ప్రభుత్వాన్ని చీల్చేందుకు దినకరన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో భాగంగా ఐటీ దాడులు జరగగా, కోట్లాది రూపాయల అక్రమాస్తులు బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు దివంగత సీఎం జయలలిత వల్లే తమ కుటుంబానికి ఈ కష్టాలని శశికళ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం తరపు మంత్రులు మాత్రం అమ్మను అడ్డం పెట్టుకుని శశికళ కుటుంబీకులు బాగా దోచుకున్నారని.. అందుకే ఐటీ అధికారులు సోదాల్లో చిక్కుకుంటున్నారని చెప్తున్నారు.