Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ మినీ కాంగ్రెస్.. ముస్లింలకు మోడీ వకాల్తాదారు : తొగాడియా నిప్పులు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నిప్పులు చెరిగారు. మోడీ సారథ్యంలోని బీజేపీ ఇపుడు ఓ మినీ కాంగ్రెస్‌గా మారిపోయిందంటూ ఆరోపించారు. అంతేకాకుండా, మ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నిప్పులు చెరిగారు. మోడీ సారథ్యంలోని బీజేపీ ఇపుడు ఓ మినీ కాంగ్రెస్‌గా మారిపోయిందంటూ ఆరోపించారు. అంతేకాకుండా, మోడీ కూడా ముస్లింలకు వకాల్తాదారుగా మారారని చెప్పారు.
 
ఇదే అంశంపై ఆయన మధురలో మాట్లాడుతూ, ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాక్ దురాచారం నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తీసుకురావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముస్లింల తరపున వకాల్తాదారు(న్యాయవాది)గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాక్ అన్నది ముస్లింల వ్యక్తిగత విషయమని, అందులో మోడీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో నెగ్గిన ఆయన, హిందూ దేశ పరిరక్షణ, కాశ్మీర్‌లోని హిందువులను రక్షించడం లేదని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా అయోధ్యలో రామమందిరం నిర్మించకపోవడం ప్రధాని నరేంద్ర మోడీ అసమర్థతకు నిదర్శనమన్నారు. బీజేపీ మినీ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments