Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాత్మాగాంధీని హత్య చేసిన వారు దేశాన్ని పాలిస్తున్నారు..

జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన వారు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారంటూ బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. వరవరరావు అరెస్టును ఖండించిన నటి కేంద్రం చేసుకున్న కొన్ని పనులు

మహాత్మాగాంధీని హత్య చేసిన వారు దేశాన్ని పాలిస్తున్నారు..
, సోమవారం, 3 సెప్టెంబరు 2018 (10:16 IST)
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన వారు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారంటూ బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. వరవరరావు అరెస్టును ఖండించిన నటి కేంద్రం చేసుకున్న కొన్ని పనులు తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయంది.


నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారి కేసుల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపించింది. వేల కోట్ల రూపాయలు ముంచేసి విదేశాలకు పారిపోతున్న వారిని ఏమీ చేయలేని ప్రభుత్వం.. నిరు పేదల కోసం పోరాడుతున్న వారిని మాత్రం అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తోందని స్వరభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసింది.
 
అలాగే ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఇటీవల మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావుతోపాటు మరో నలుగురు హక్కుల నేతలను అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి ఓ ట్వీట్‌లో అర్బన్ నక్సలైట్లను సమర్థించేవారి జాబితాను తయారుచేసేందుకు చురుకైన యువత కావాలని కోరాడు. ఇందుకోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే యువత తనను సంప్రదించాలని పిలుపునిచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో వివేక్ ట్వీట్‌కు నటి స్వర భాస్కర్ ఫన్నీగా స్పందించింది. అర్బన్ నక్సల్స్‌ను తాను చూశానని, వారు టీవీ చర్చల్లో కనిపిస్తారని, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లలో ఉంటారని, ఇది చాలా హాస్యాస్పదమని చలోక్తులు విసిరింది. అంతేకాదు, వరవరరావు తదితరుల అరెస్ట్‌పైనా తీవ్రంగా స్పందించింది.
 
ప్రజలను వారి చర్యల ద్వారా మాత్రమే శిక్షించగలరేమో కానీ వారి ఆలోచనలకు శిక్ష లేదని స్వర భాస్కర్ వెల్లడించింది. ఒకవేళ వ్యక్తుల ఆలోచనలకే అరెస్టులు చేసుకుంటూ పోతే దేశంలోని జైళ్లు సరిపోవని తెలిపింది. అప్పట్లో మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు చాలామంది పండుగ చేసుకున్నారని, ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారంటూ స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వారిని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్దిక్ పటేల్ ఆమరణదీక్ష - బ్యాంకు ఖాతాలోని సొమ్ముపై వీలునామా...