Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాడ్సేకు వీరాభిమానిని... గాంధీ వుంటే నేనే చంపేదాన్ని : హిందూ కోర్టు జడ్జి

స్వయం ప్రకటిత, వివాదాస్పద హిందూ కోర్టు జడ్జి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మహాత్మా గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే నేను చంపేదాన్ని' అని ఆమె వ్యాఖ్యానించారు. పైగా, గా

Advertiesment
గాడ్సేకు వీరాభిమానిని... గాంధీ వుంటే నేనే చంపేదాన్ని : హిందూ కోర్టు జడ్జి
, శుక్రవారం, 24 ఆగస్టు 2018 (09:21 IST)
స్వయం ప్రకటిత, వివాదాస్పద హిందూ కోర్టు జడ్జి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మహాత్మా గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే నేను చంపేదాన్ని' అని ఆమె వ్యాఖ్యానించారు. పైగా, గాంధీని గాడ్సే చంపలేని స్పష్టంచేశారు.
 
ఇదే అంశంపై ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో... 'నేటికైనా సరే.. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే, అడ్డుకునే గాడ్సే ఒకరుంటారు. నాథూరామ్‌ గాడ్సేను నేను ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తున్నాను. గాంధీని గాడ్సే చంపలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేలోపే అతడిని శిక్షించారు. అందరూ అసలు చరిత్ర చదవాలి' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, గతంలో సైతం.. ట్రిపుల్‌ తలాక్‌ వల్ల భర్తలకు దూరమైన ముస్లిం మహిళలు హిందూధర్మాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాలకు కేంద్రబిందువయ్యాయి. కాగా, హిందూ కోర్టు పేరుతో అఖిల భారత హిందూ సభ (ఎబిహెచ్‌ఎం) కొద్ది రోజుల క్రితం మీరట్‌లో సొంతంగా హిందూ కోర్టును ఏర్పాటు చేసింది. ఈ కోర్టు ఏర్పాటుపై అలహాబాద్ కోర్టులో విచారణ జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మా.. నేనూ నీ వద్దకే వస్తున్నా'... గుంటూరు యువకుడు సూసైడ్