రెండోసారి ప్రధానిగా మోడీ వద్దంటున్నారు : కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని రెండోసారి చూసేందుకు ఎన్డీయే కూటమిలోని అనేక రాజకీయ పార్టీల నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు.

శనివారం, 1 సెప్టెంబరు 2018 (16:56 IST)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని రెండోసారి చూసేందుకు ఎన్డీయే కూటమిలోని అనేక రాజకీయ పార్టీల నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీని మళ్లీ ఆ పదవిలో చూడటానికి ఎన్‌డీఏ భాగస్వాముల్లో కొందరికి ఇష్టం లేదన్నారు.
 
ఎన్‌డీఏ కూటమిలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ) ఒక మిత్రపక్షంగా ఉంది. ఈ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ బీజేపీకి ఓట్లు పడేలా తాను కృషి చేస్తానని చెప్పారు. మోడీ విషయంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదనీ మైనర్ బాలికపై అత్యాచారం...