Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ... 10 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (13:26 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ మాల్‌లో సన్‌రైజ్ కరోనా ఆస్పత్రిలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చనిపోయినవారి సంఖ్య 10కి చేరింది. ముంబై మహా నగరంలోని భాండప్‌ ప్రాంతంలో ఓ మాల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే మాల్‌లోని ఓ అంతస్తులో కరోనా ఆస్పత్రి కూడా ఉంది. ఇందులో 70 మందికిపైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. 
 
గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత స్థానిక డ్రీమ్స్‌ మాల్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మూడో అంతస్తులో ఉన్న సన్‌రైజ్‌ హాస్పిటల్‌ వరకు మంటలు వ్యాపించాయి. ఈ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అయితే తమ ఆస్పత్రిలో ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కొవిడ్‌తో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను అగ్నిప్రమాదం తర్వాత బయటకు తీసుకొచ్చినట్లు సర్‌రైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
‘‘ఫైర్‌ అలారం మోగడంతో మేం అప్రమత్తమై 76 మంది రోగులకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం. కరోనాతో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను తీసుకొచ్చాం’’ అని తెలిపాయి. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
 
ఘటనాస్థలాన్ని ముంబై కిషోరీ మేయర్‌ పరిశీలించారు. మాల్‌లో ఆస్పత్రిలో ఉండటం పట్ల మేయర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే తాము నిబంధనల ప్రకారమే ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేశామని సన్‌రైజ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. మాల్‌లో ఆస్పత్రి నడిపేందుకు ఎలా అనుమతి ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments