Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 6 వేల మంది ఆర్టీసీ కార్మికుల సస్పెండ్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (15:41 IST)
మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఆరు వేల మంది ఆర్టీసీ కార్మికులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీచేసింది. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా బస్సు రవాణా వ్యవస్థ స్తంభించింది. 
 
రావాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆ సంస్థకు చెందిన కార్మికులు గత నెల రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. దీంతో కన్నెర్ర జేసిన ఆర్టీసీ యాజమాన్యం ఆరు వేల మందిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
గత కొన్ని రోజులుగా ఈ సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వుంది. ఈ క్రమంలో శనివారం 3010 మందిని సస్పెండ్ చేయగా, 270 మందిని కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆదివారం కూడా మరికొంతమందిని తొలగించింది. ఇలా మొత్తం సస్పెండ్ కార్మికుల సంఖ్య ఆరువేలకు చేరింది. 
 
ఇదిలావుంటే, ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణా మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్మికులంతా సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా, 92622 మంది ఉద్యోగుల్లో 18 వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, మిగిలిన ఉద్యోగులు కూడా విధుల్లో చేరాలని కోరారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments