Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిఆర్ సి స‌మావేశం

Advertiesment
వారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిఆర్ సి స‌మావేశం
విజ‌య‌వాడ‌ , శనివారం, 27 నవంబరు 2021 (18:24 IST)
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున పిఆర్సి అమలు గురించి చ‌ర్చ‌లు మ‌రో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25న ముఖ్యమంత్రిని కలిసినపుడు వారం పది రోజుల్లో మొత్తం పిఆర్సి ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను  వచ్చేవారం పిఆర్సీ అమలుపై చర్చలకు పిలిచే అవకాశం ఉంది. 
 
 
ఎపీజీఇఎఫ్ సభ్య సంఘాల అభిప్రాయం తెలుసుకోవడానికి రాష్ట్ర కార్యవర్గ  సమావేశం ఏర్పాటు చేశారు. ఛైర్మ‌న్ కాకర్ల వెంకట రామిరెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ సమావేశానికి ఎపీజీఇఎఫ్  అనుబంధంగా ఉన్న 92 సంఘాల సభ్యులు హాజరయ్యారు.  40శాతం ఫిట్మెంట్ తో 11వ పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించారు.  అలాగే 11వ  పీఆర్సీని 2018 జూలై నుంచి అమలు చేయాలని, 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని, 2022 జనవరి నుంచి జీతంతో పాటు నగదు రూపంలో అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

 
ఇంటి అద్దె అలవెన్స్ విషయంలో ఇపుడు అమలవుతున్న రేట్లను యధాతథంగా కొనసాగించాలని కోరుతున్నారు. గతంలో లాగా కాకుండా, ఈ 11వ పీఆర్సీ రెగ్యులర్ ఉద్యోగులతో పాటే యూనివర్సిటీ, కార్పొరేషన్, మోడల్ స్కూల్స్,  కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఒకేసారి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై దృష్టి పెట్టి దానిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు మేరకు అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు  యాన్యువల్ ఇంక్రిమెంట్ కానీ లేదా డిఎ కానీ మంజూరు చేయాలని కోరుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీపురం వద్ద గల్లంతై... కొరమేనుగుంటలో శవమై తేలి...