Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌ కోసం కన్నబిడ్డను చంపేసింది.. మద్యం తాగించి..?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (22:38 IST)
నాలుగో బాయ్‌ఫ్రెండ్‌తో జల్సాల కోసం కన్నబిడ్డనే హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. ఊటీలోని వాషర్‌మెన్ పేట్‌కు చెందిన కార్తీక్ (40), గీత (38)ను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో కొంత కాలం సంతోషంగా కాపురం చేశారు. 
 
ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలు చేసినా కాపురం నిలబడకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో కొడుకులు నితీశ్‌, నితిన్‌లను పంచుకున్నారు. ఒక కొడుకు తల్లి దగ్గర, ఇంకో కొడుకు తండ్రి దగ్గర ఉంటున్నారు.
 
ఓ రోజు తల్లి దగ్గర ఉన్న నితిన్‌ ఆందోళనతో ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లింది. తన కొడుకు ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడని ఆమె వైద్యుల వద్ద కన్నీరుపెట్టుకుంది. ఈ క్రమంలో అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. 
 
బాలుడి మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. గీతకు అప్పటికే నలుగురు బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారని పోలీసులు గుర్తించారు. నాలుగో బాయ్‌ఫ్రెండ్ కోసం తన బిడ్డను హతమార్చినట్లు తెలిపారు. 
 
కార్తీక్‌తో పెళ్లికి ముందే మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకుని విడాకులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. నాలుగో బాయ్‌ ఫ్రెండ్‌తో జల్సాల కోసమే విడాకులు తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 
తమ జల్సాల అడ్డుగా ఉన్నాడనే గీత తన బిడ్డకు.. మద్యం తాగించి, ఎక్కువ భోజనం పెట్టి, పదే పదే పాలు తాగించి హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమెను అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments