టూరిస్ట్ చేతిలో నుంచి నోట్ల కట్టలను లాక్కెళ్లిన కోతి!

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (11:43 IST)
తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైక్కెనాల్లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పర్యటకుల నుంచి ఓ కోతి ఏకంగా రూ.500 నోట్ల కట్టను లాక్కెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న టూరిస్టులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, 
 
కొడైక్కెన్‌లోని గుణ గుహ సందర్శనకు వచ్చిన కర్ణాటకకు చెందిన కొందరు పర్యటకుల చేతిలో ఉన్న రూ.500 నోట్ల కట్టను ఓ కోతి అమాంతం లాగేసుకుంది. అంతటితో ఆగకుండా ఆ నోట్లతో చెట్టు ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది. వాటిని గాల్లోకి విసిరేయడం చేసింది. ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో వీడియో వైరల్‌గా మారింది.
 
ఇలాంటి ఘటనలు మన దేశంలో కొత్తేమీ కాదు. గతంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో ఓ సంఘటన జరిగింది. అక్కడ ఓ ఆటో ప్రయాణికుడి నుంచి ఏకంగా లక్ష రూపాయల నగదును ఓ కోతి లాక్కెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టెక్కి నోట్లను కిందకు విసిరేయడంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు.
 
సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటాయి. పర్యటకులు, స్థానికులు వాటికి ఆహారం అందించడం వల్ల అవి మనుషులకు బాగా అలవాటుపడి, వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనుకాడటం లేదని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కోతులకు ఆహారం పెట్టడం, వాటిని మనుషులకు మరీ దగ్గరగా రానివ్వడం వంటి చర్యల వల్లే ఇలాంటి సమస్యాత్మక ప్రవర్తన వాటిలో పెరుగుతోందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారు తమ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments