Publish Date: Mon, 09 Jun 2025 (15:04 IST)
Updated Date: Mon, 09 Jun 2025 (15:08 IST)
సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ పోషించనున్న పాత్ర చాలా ప్రత్యేకమైనది. హాస్యం, హృద్యత, భావోద్వేగాలు మిళితమైన ఈ పాత్ర ఆయన నటనకు మరో కొత్త కోణాన్ని పరిచయం చేయనుంది. ఇది ఆయన సినీ ప్రయాణంలో ఒక విభిన్నమైన మలుపు అని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ, “సునీల్ గారు ప్రేక్షకుల్లోకి దగ్గరయ్యే నటుడు మాత్రమే కాదు, ఒక సహజ నటనకు నిలువెత్తు ఉదాహరణ. ఈ సినిమాలో ఆయన చేయబోయే పాత్ర ఆయన ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నమైనది. ఇది హృదయానికి హత్తుకునే, చాలా సహజమైన పాత్ర.” అని తెలిపారు.
చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను జూన్ 15న విడుదల చేయనున్నారు. అలాగే, ఇంకెంతో మంది ప్రముఖ నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.