జ్యేష్ణమాసం కృష్ణపక్షంలో వచ్చే చవితిని కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అంటారు. జూన్ 14న ఈ సంకష్టహర చతుర్థి రానుంది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కృష్ణ పింగళ సంకష్టహర గణపతి వ్రతావరణ వల్ల కుజదోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా సంతాన్ని ప్రసాదించేదిగా భావిస్తారు. కృష్ణ పింగళ సంకష్ట హర చతుర్థి రోజున భక్తులు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం వుండి.. చంద్రుడిని పూజించిన తర్వాత ఉపవాసాన్ని ముగించాలి.
ఈ రోజున గణేశునికి దర్భలు, మోదకం, పండ్లు సమర్పించాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంకష్ట హర ఉపవాస వ్రతం ప్రాచీనమైంది. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవ రాజు యుధిష్ఠిరుడికి ఈ ఉపవాసం ప్రాముఖ్యతను వివరించినట్లు చెప్పబడివుంది.
అందువల్ల రోజంతా ఉపవాసం వుండి, వ్రత కథను చదువుతారు. చంద్రుడిని చూసిన తర్వాత గణేశుడిని పూజించి.. వ్రతాన్ని ముగుస్తారు. ఈ రోజున చంద్రుడిని పూజించడం వల్ల జాతకంలోని చంద్ర దోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో వున్న విఘ్నేశ్వరుడి ఆలయాన్ని సందర్శిస్తే సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు నాలుగు సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.