Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు.. చెల్లెల్ని హత్య చేసిన అక్క.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (18:38 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్కాచెల్లెళ్ల ప్రేమంటే చాలా గొప్పగా వుండేది. కానీ ప్రస్తుతం ప్రేమ, ఆప్యాయతలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా.. తన ప్రేమకు అడ్డుగా వున్న చెల్లెలను అక్క హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇప్పటికే నేరాల అడ్డాగా మారిపోయిన ఉత్తరప్రదేశ్‌లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని వారణాసి, మిర్జాపూర్‌లోని ఓ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లల్లో 15 ఏళ్ల అక్కకు ప్రేమ పుట్టింది. అయితే 15 ఏళ్ల ఆ బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన ప్రేమికుడిని ఇంటికి రప్పించేది. అయితే అక్క వాలకం 11 ఏళ్ల చెల్లెకు నచ్చలేదు. ఈ వ్యవహారం ఆపాలని పలుసార్లు బెదిరించింది. ఈ వ్యవహారాన్ని ఆపకపోతే.. తల్లిదండ్రులకు చెప్పేస్తానని బెదిరించింది. 
 
ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులకు రెండో అమ్మాయిపైనే ప్రేమ ఎక్కువని స్థానికులు చెప్తున్నారు. దీంతో తన ప్రేమకు అడ్డుగా వుందని.. తల్లిదండ్రులు కూడా చెల్లెలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలిసి అక్క రగిలిపోయేది. అంతే చెల్లెల్ని చంపేందుకు అక్క ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి మిర్జాపూరుకు తీసుకెళ్లింది. అక్కడ చెల్లెల్ని గొంతు నులిమి చంపేసింది. ఆపై చెల్లెలి మృతదేహాన్ని రైలు ట్రాకుపై పడేసి వచ్చింది. 
 
అయితే కుమార్తె కనబడలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు షాక్ తప్పలేదు. పోలీసులు జరిపిన విచారణలో అక్క తన ప్రియుడితో కలిసి చెల్లెలను హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు అక్క, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments