Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 15మంది సజీవదహనం

ముంబై నగరంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 15మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 12మంది మహిళలు వున్నారు. కమలా మిల్స్ కాంపౌండ్‌లోని పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతి కావడంతో 12 మంది తీవ్రగా

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (11:24 IST)
ముంబై నగరంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 15మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 12మంది మహిళలు వున్నారు. కమలా మిల్స్ కాంపౌండ్‌లోని పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతి కావడంతో 12 మంది తీవ్రగాయాల పాలైనారు. 
 
క్షతగాత్రులను సహాయక సిబ్బందికి ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి 12.27 గంటలకు ప్రమాద స్థలం నుంచి తమకు తొలి ఫోన్ కాల్ వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే 8 శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు పేర్కొన్నారు.
 
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టులు మాట్లాడుతూ, రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయన్నారు. ఆ మంటలు సమీపంలో వున్న డిన్నర్ కమ్ పబ్‌లకు వ్యాపించాయని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments