Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యాయవాది కాదు.. కామాంధుడు.. 15 యేళ్ల బాలికను పెళ్లాడాడు...

బాల్య వివాహాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే సమాజంలో జరిగే బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన ఓ న్యాయవాదే స్వయంగా 15 యేళ్ల బాలికను పెళ్లి చేసుకోవడమేకాకుం

న్యాయవాది కాదు.. కామాంధుడు.. 15 యేళ్ల బాలికను పెళ్లాడాడు...
, శుక్రవారం, 22 డిశెంబరు 2017 (13:50 IST)
బాల్య వివాహాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే సమాజంలో జరిగే బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన ఓ న్యాయవాదే స్వయంగా 15 యేళ్ల బాలికను పెళ్లి చేసుకోవడమేకాకుండా తనకు పడక సుఖం ఇవ్వాలంటూ లైంగికంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన ఓ న్యాయవాది (53) స్థానిక హైకోర్టులో న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నాడు. ఈయనకు 2014లో భార్య చనిపోయింది. అదేసమయంలో 15 యేళ్ల వయసున్న కుమార్తె కూడా ఉంది. అయితే భార్య చనిపోవడంతో తన కుమార్తె వయసుండే బాలికపై కన్నేశాడు. ఆ బాలిక గురించి ఆరా తీశాడు. ఆర్థికస్థితిగతులను తెలుసుకున్నాడు. ఆ బాలిక తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇదే మంచి తరుణమని భావించి, ఓ మధ్యవర్తి ద్వారా తన పెళ్లి ప్రతిపాదనను చేరవేశాడు. పైగా, రూ.లక్షలతోపాటు ఐదు ఎకరాల భూమి ఇస్తానని ఆశ చూపాడు.
 
దీంతో న్యాయవాదితో బాలిక పెళ్లి చేసేందుకు అమ్మమ్మ, తాత అంగీకరించారు. ఈ పెళ్లి అమ్మాయికి, ఆమె తండ్రికి ఇష్టం లేదు. తాను ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నానని.. ఉన్నత చదువులు చదవాలని ఉందని బాలిక తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదివిస్తానని బాలికను లాయర్ నమ్మించాడు. బలవంతంగానే 2015, ఏప్రిల్ 21వ తేదీన ఆ అమ్మాయిని న్యాయవాది.. బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. 
 
ఇక అప్పటి నుంచి ఆ మైనర్ భార్యకు నరకం మొదలైంది. ఒక భార్యగా చూడకుండా వేశ్యగా చూడటం మొదలుపెట్టాడు. తీవ్రమైన చిత్ర హింసలకు గురిచేశాడు. న్యాయవాది హింస భరించలేని ఆ అమ్మాయి ఈ నెల 13న పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ న్యాయవాదిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థి ఎవరో తెలిస్తే షాకే?